చాలా భాషల్లో రీమేక్ అయిన తెలుగు మూవీస్ ఎన్ని ఉన్నాయో…?
Tollywood Movies Remake :ఇప్పుడు ఎక్కువగా రీమేక్ మూవీస్ తెలుగులో వస్తున్నాయి. వివిధ భాషల్లో హిట్స్ కొట్టిన మూవీస్ రైట్స్ కొనుగోలు చేసి, ఇక్కడ మన అగ్ర హీరోలు నటిస్తున్నారు. నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే తెలుగులో హిట్ అయిన చిత్రాలు కూడా పలు భాషల్లోకి రీమేక్ అవ్వడం, డబ్ అవ్వడం జరిగాయి.
అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు భాషలకు పైగా రీమేక్ అయిన ఘనత సాధించిన సినిమాలున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్టార్ హోదా తెచ్చిన ఒక్కడు మూవీ తమిళ్, కన్నడ, ఒడియా, బెంగాలీ, హిందీ భాషల్లో రీమేక్ అయింది. అన్నిచోట్లా విజయాన్ని నమోదు చేసింది. అలాగే మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన పోకిరి మూవీ కూడా ఈ ఐదు భాషల్లోకి రీమేక్ అవ్వడంతో అన్నింటా విజయాన్ని అందుకుంది.
విక్టరీ వెంకటేష్ నడిచిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ కన్నడ,బెంగాలీ,భోజ్ పురి,తమిళ, ఒడియా భాషల్లో రీమేక్ అయి,సూపర్ హిట్ గా విజయాన్ని అందుకుంది. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఎస్ ఎస్ రాజమౌళి తెరెకెక్కించిన విక్రమార్కుడు మూవీ రవితేజ కెరీర్ ని మార్చేసింది. ఈ మూవీ తమిళ,కన్నడ,హిందీ,బెంగాలీ భాషల్లో అలాగే బాంగ్లాదేశ్ బెంగాలీలో రెండుసార్లు రీమేక్ అయి, అఖండ విజయాన్ని అందుకుంది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కింది. ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ మూవీలో సిద్ధార్ధ్, త్రిష హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇది ఏకంగా 9భాషల్లో అంటే, కన్నడ,తమిళ్,బెంగాలీ,హిందీ,మలయాళ,బెంగాలీ,మణిపురి,నేపాల్,బాంగ్లాదేశ్ లలోని భాషల్లో రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జక్కన్న తెరకెక్కించిన మర్యాద రామన్న మూవీ కన్నడ,తమిళ్, బెంగాలీ,హిందీ,మలయాళ భాషల్లో రీమేక్ కావడంతో అన్నిచోట్లా మంచి విజయాన్ని అందుకుంది.

