MoviesTollywood news in telugu

మన స్టార్స్ కి నచ్చిన సినిమా స్టార్స్ ఎవరో తెలుసా?

Tollywood stars and their favourite stars :చాలామంది సినిమా అభిమానులుంటారు. ఫలానా హీరో, హీరోయిన్ సినిమా అంటే రిలీజ్ రోజునే చూసేస్తారు. అయితే స్టార్ హీరోలకు కూడా నచ్చిన స్టార్స్ ఉంటారు. స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కి సీన్ కానరీ అంటే ఇష్టం. ఇక మహానటి సావిత్రి అంటే చాలా అభిమానం. అక్కినేని వారసుడు, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ఇక హీరోయిన్స్ లో టబు అంటే ఇష్టం.

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడు వెంకటేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. హాలీవుడ్ స్టార్స్ మార్లన్ బ్రాండో, రాబర్ట్ రెడ్ ఫోర్ట్ లంటే ఇష్టం. ఇక హీరోయిన్స్ లో శ్రీదేవి,రేవతి,సౌందర్య అంటే ఇష్టం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్ పాసినో,రాబర్ట్ డి నీరో,అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. హీరోయిన్స్ లో మహానటి సావిత్రి అంటే ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ కి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, మహానటి సావిత్రి అంటే ఇష్టం. సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, కమల్ హాసన్ లంటే ఇష్టం. ఇక హీరోయిన్స్ లో శ్రీదేవి , త్రిష అంటే ఇష్టం.

ప్రభాస్ కి రాబర్ట్ డి నీరో, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇష్టమైన హీరోలు. ఇక హీరోయిన్స్ రవీనా టాండన్,జయసుధ,దీపికా పదుకునే,త్రిష, శ్రేయ అంటే ఇష్టం. అల్లు అర్జున్ కి చిరంజీవి,రాణీముఖర్జీ అంటే ఇష్టం.రామ్ చరణ్ కి టామ్ హాంక్స్, శ్రీదేవి అంటే ఇష్టం.

మాస్ మహారాజ రవితేజకు అమితాబ్ బచ్చన్, గోవిందా, మోహన్ లాల్,చిరంజీవి,రజనీకాంత్ అనే ఇష్టం. ఇక హీరోయిన్స్ లో తమన్నా అంటే ఇష్టమట. అల్లరి నరేష్ కి నాగార్జున అంటే ఇష్టం. హీరోయిన్స్ లో అలియా భట్, పరిణీతి చోప్రా అంటే ఇష్టం.

నేచురల్ స్టార్ నానికి చిరంజీవి,శోభన్ బాబు,రవితేజ,కమల్ హాసన్,ప్రభాస్ అంటే ఇష్టం. హీరోయిన్స్ లో సావిత్రి,శ్రీదేవి,కీర్తి సురేష్ అంటే ఇష్టం. సాయి ధర్మ తేజ్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టం. హీరోయిన్స్ లో సమంత అంటే ఇష్టం.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, సిల్వర్ స్టెన్ స్టాలోన్ అంటే ఇష్టం. ఇక హీరోయిన్స్ లో హేమమాలిని, రేఖ అంటే ఇష్టం. కమల్ హాసన్ కి ఎంజి రామచంద్రన్, నగేష్, శివాజీ గణేశన్, రాజేష్ ఖన్నాఅంటే ఇష్టం. అలాగే హీరోయిన్స్ లో శ్రీదేవి, శ్రీప్రియ అంటే ఇష్టం.