MoviesTollywood news in telugu

సాయి పల్లవి తల్లితండ్రులు ఏమి చేస్తారో తెలుసా?

Tollywood heroine Sai Pallavi :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా తెలంగాణా ప్రజల మన్ననలు పొందిన సాయిపల్లవి రెమ్యునరేషన్ కంటే, పాత్రల ప్రాధాన్యతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ పొందిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, ఆమె తండ్రి సెంథామార్తె కన్నన్ సెంట్రల్ ఎక్సయిజ్ ఆఫీసర్ గా ఉన్నారు. తల్లి రాధ గృహిణి. సాయిపల్లవికి పూజా అనే చెల్లెలు ఉంది. తెలుగు,మలయాళ,తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ మూడు చోట్లా క్రేజ్ తెచ్చుకున్న సాయిపల్లవి ఎన్నో ఫిలిం ఫెర్ అవార్డులు తెచ్చుకుంది.

ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా విరాట పర్వం,అలాగే లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ లో సాయిపల్లవి నటిస్తోంది. ఈ మూడు మూవీస్ కూడా ఒకదాని వెంట మరొకటి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఈ రౌడీ బేబీకి ఫాన్ ఫాలోయింగ్ దండిగానే ఉంది.