MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే చూసేయండి

Tollywood Heroine deepti bhatnagar : తెలుగు,తమిళ,మలయాళం,హిందీ భాషల్లో దాదాపు పాతిక చిత్రాల్లో నటించి గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ దీప్తి భట్నాగర్ ఓ ముద్ర వేసుకుంది. ఇక ఈమె నటించిన పెళ్లి సందడి మూవీ బ్లాక్ బస్టర్,మ్యూజికల్ హిట్ గా నిల్చింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించిన ఈ మూవీలో దీప్తి తో పాటు రవళి కూడా యాక్ట్ చేసింది. ఇందులో పాటలన్నీ ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి.

శ్రీకాంత్ కెరీర్ లో అద్భుత చిత్రంగా నిల్చిన పెళ్లిసందడితో దీప్తి భట్నాగర్ కి కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆటో డ్రైవర్,సుల్తాన్,మా అన్నయ్య, కొండవీటి సింహాసనం వంటి మూవీస్ లో నటించి, తన అందం అభినయంతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. పైగా ఆమె నటించిన మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యాయి.

తాజాగా యోగా దినోత్సవం నాడు చేసిన యోగ ఫోటోలను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి షేర్ చేయడంతో ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా అప్పుడప్పుడు స్పెషల్ ఫీచర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే, బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితం అయింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మీరట్ పరిసర ప్రాంతాల్లో హ్యాండ్ లూమ్ పరిశ్రమ పెట్టి, బిజినెస్ రంగంలో రాణిస్తోంది