MoviesTollywood news in telugu

కళాతపస్వి విశ్వనాధ్ ఎంట్రీ వెనుక పెద్ద కథే ఉంది…ఏమిటో తెలుసా?

Tollywood director viswanath :శంకరాభరణం,సాగర సంగమం,స్వర్ణ కమలం,సిరిసిరి మువ్వ,స్వాతిముత్యం,స్వయంకృషి వంటి కళాత్మక విలువలు కల్గిన సినిమాలు తీసి, టాలీవుడ్ లో కళాతపస్వి గా నిల్చిన కె విశ్వనాధ్ తీసిన సినిమాలు అజరామరం. అగ్ర హీరోలు సైతం ఈయన సినిమాల్లో నటించాలని తపించేలా చేసారు. ఇక ఎలాంటి స్టార్ డమ్ గల హీరో హీరోయిన్స్ లేకుండానే శంకరాభరణం సినిమా తీసి,తెలుసు సినిమా చరిత్రలో ఓ ఆభరణంగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఈ సినిమా టివిలో వస్తే అతుక్కుపోయి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నటసామ్రాట్ అక్కినేని నటించిన ఆత్మగౌరవం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విశ్వనాధ్ సినిమా రంగంలో అన్ని విభాగాల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి.

మూగమనసులు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన విశ్వనాధ్ సినిమా ఎంట్రీ ఎలా జరిగిందనే విషయంలోకి వెళ్తే, అతడి తండ్రి కూడా ఇండస్ట్రీలో పనిచేసారు. దాంతో సౌండ్ ఇంజనీర్ గా విశ్వనాధ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శక దిగ్గజం కెవిరెడ్డి తీసిన సుగుణ సుందరి కథ మూవీకి సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన విశ్వనాధ్ అదే సమయంలో బి ఎన్ రెడ్డి తీసిన షావుకారు మూవీకి విశ్వనాధ్ అందరికీ శిక్షణ ఇచ్చేలా వ్యవహరించడంతో పాటు విశ్వనాధ్ తండ్రి సుబ్రహ్మణ్యం వాహిని స్టూడియోలో పనిచేయడం మరో విశేషం. 1938నుంచి సుబ్రహ్మణ్యం ఆ సంస్థలో పనిచేయడం వలన విశ్వనాధ్ ని కూడా తీసుకున్నారు.

బంగారు పాప,మల్లీశ్వరి వంటి సినిమాలు చేస్తున్న సమయంలో కెవి రెడ్డి, బి ఎన్ రెడ్డి దగ్గర సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మార్కస్ బార్ట్లీ తో విశ్వనాధ్ క్లోజ్ గా మూవీ అయ్యేవారు. ఇక ఆదుర్తి సుబ్బారావు దగ్గర సౌండ్ రికార్డిస్టుగా పనిచేస్తున్న సమయంలో అక్కినేనితో సన్నిహితత్వం ఏర్పడింది. మంచి మిత్రులుగా కూడా ఉండేవారు. ఇక ఆదుర్తితో సరేసరి. మొత్తానికి డైరెక్షన్ చేయాలన్న కోరిక కలగడంతో మూగమనసులు స్టోరీ చర్చల్లో భాగం పంచుకున్నారు. చదువుకున్న అమ్మాయిలు,డాక్టర్ చక్రవర్తి వంటి మూవీస్ కి అసిస్టెంట్ గా చేసి, మూగమనసులు మూవీకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అయ్యాడు. దాంతో ఆత్మగౌరవం మూవీతో దర్శకుడిగా మారి,తెలుగు చిత్రసీమ గర్వించే దర్శకుడిగా నిలిచారు.తర్వాత నుంచి క్యారెక్టర్ నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.