టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సత్తా చాటుతున్న హీరోలు
Tollywood Young heroes :మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలే కాకుండా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగిన యంగ్ హీరోలు కూడా ఉన్నారు. ఆ మధ్య ఓటిటి లో రిలీజైన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీతో పాటు కలర్ ఫోటో మూవీతో ఆకట్టుకున్న యంగ్ హీరో సుహాస్ పలు సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటు న్నాడు. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఆకట్టుకున్న మోహన్ భగత్ కి సరైన సినిమాలు వస్తే ఇండస్ట్రీలో నిలబడతాడు.
బోల్డ్, సహజతత్వంతో సాగే ‘కొత్త పోరడు’ మూవీలో అన్వేష్ మిచెల్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇదే మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన రాజ్ తీరం దాసు బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఇదే సినిమాతో పాటు వంగవీటి మూవీలో కూడా నటించిన సందీప్ మాధవ్ కూడా తన నటనతో అలరిస్తున్నాడు. 1878పలాస మూవీలో మెయిన్ రోల్ చేసిన రక్షిత్ తన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.
జార్జిరెడ్డి మూవీలో ఔరా అనిపించేలా నటించిన తిరువీర్ నటనలో మంచి సత్తా ఉంది. ఇదే మూవీలో దస్తగిరి పాత్రతో అలరించిన పవన్ రమేష్ లో కూడా మంచి నటుడు దాగిఉన్నాడు. ఇక గాడ్స్ ఆఫ్ ధర్మపురి మూవీలో క్యారెక్టర్ యాక్టర్ జగదీశ్ అద్భుత నటన ప్రదర్శించాడు. ఛాన్స్ లు వస్తే బాగానే నిలబడతాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప మూవీలో వెంకీ పెద్ద కొడుకుగా కార్తీక్ నటన బాగుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

