అల్లు అర్జున్ వరకట్నంగా ఎంత అందుకున్నాడో తెలుసా?
Allu Arjun And Sneha reddy :అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి,తర్వాతా తన నటనతో ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ స్టైలిష్ స్టార్ అయ్యాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇతడి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి. చాలామంది హీరోల మాదిరిగా బన్నీ కూడా లవ్ మేరేజ్ చేసుకున్నాడు.
తెలంగాణకు చెందిన స్నేహారెడ్డిని ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిచేసుకున్న బన్నీ మొదటగా తన ప్రేమ సంగతి ఇంట్లో అమ్మకు చెప్పాడట. అలా ఇంట్లో అందరినీ ఒప్పించాడు. అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో టిఆర్ ఎస్ పార్టీలో కీలకంగా ఉంటున్నారు.వివిధ విద్యా సంస్థలను నడుపుతున్న ఆయన సీఎం కేసీఆర్ కి అంత్యంత సన్నిహితుడు.
ఇక కూతురు పెళ్ళికి దాదాపు 300 కోట్ల రూపాయలను అల్లుడికి ముట్టజెప్పినట్లు టాక్. ఎందుకంటే మామ నడిపే విద్యాసంస్థలకు బన్నీ డైరెక్టర్ గా ఉన్నాడు. స్థిర చరాస్తులు కల్పి మొత్తం మీద 300కోట్లు బన్నీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ వరుస హిట్స్ తో దూసుకెళ్తూ గత సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీలో డిఫెరెంట్ మాస్ రోల్ చేస్తున్నాడు.

