నాగసౌర్య షూస్ విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Tollywood Hero naga shaurya shows price : సెలబ్రిటీలు వాడే కార్లు,బైక్ లు,వాచీలు,షూస్, డ్రెస్ ఇలా ప్రతీదీ బ్రాండెడ్ గానే ఉంటాయి. ఇక కరోనా సమయంలో ఖరీదైన మాస్క్ లు ధరిస్తున్నారు. వీళ్ళు వాడే వస్తువులు,ధరించే దుస్తులు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. తాజాగా యంగ్ హీరో నాగసౌర్య ధరించిన షూస్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
చందమామ కథలు మూవీతో 2014లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగసౌర్య కొన్ని హిట్స్ అందుకున్నా ఈమధ్య బాగా ప్లాప్ ల బాట పట్టాడు. ఎంచుకున్న కథల విషయంలో తేడా కొట్టడం వలన సరైన బ్రేక్ రాకుండా పోయింది. చలో,ఒక మనసు,ఊహలు గుసగుసలాడే మూవీస్ బాగానే ఉన్నా, ఆతర్వాత నటించిన నర్తనశాల, జాదూగాడు, కల్యాణవైభోగమే, దిక్కులు చూడకు రామయ్య వంటి మూవీస్ డిజాస్టర్ అయ్యాయి.
ఇక యితడు ధరించిన బూట్లు విషయానికి వస్తే, వీటి ధర అక్షరాలా ఒక లక్షా 45వేలు. ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న లక్ష్య మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీలో సిక్స్ ప్యాక్ కోసం శ్రమిస్తూ, జిమ్,ఆహారపు అలవాట్లు మార్చేశాడు. జిమ్ చేయడానికి వీలుగా ఈ ఖరీదైన షూ వాడుతున్నాడట.