MoviesTollywood news in telugu

తొలి సినిమాతోనే హిట్ కొట్టిన స్టార్స్…ఎంత మంది ఉన్నారో…?

Stars BoxOffice Hits with Debut Films :విశ్వవిఖ్యాత నటసార్వ భౌమగా నిల్చిన ఎన్టీఆర్ తొలిసారిగా 1949లో మనదేశం మూవీలో నటించి మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుని తెలుగు వెండితెరకు ఒక కన్నుగా భాసిల్లారు.

1965లో ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్ లో తేనెమనసులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తెలుగు చిత్ర సీమలో ఎన్నో ప్రయోగాలు చేసి, సూపర్ స్టార్ అయ్యారు.

పలు సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ బాబు స్వర్గం నరకం మూవీతో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, 1975లో మంచి విజయాన్ని అందుకున్నాడు.

సుమన్ హీరోగా తెలుగులో వచ్చిన తొలిచిత్రం తరంగిణి ఏడాదిపాటు ఆడింది. 1982లో నాలుగు స్తంభాలాట మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి మూవీతోనే హీరోగా తన సత్తా చాటాడు.

1985లో వందేమాతరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. 1986లో విక్రమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు నాగార్జున మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అదే ఏడాది కలియుగ పాండవులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మంచి విజయాన్ని అందుకుని ఆ తర్వాత విక్టరీ వెంకీ అయ్యాడు.

హరీష్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ ఖైదీ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని నమోదుచేసింది. తొలిసినిమా తోనే అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా తెచ్చుకున్నాడు. నువ్వే కావాలి మూవీతో 2000 సంవత్సరంలో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్ తొలిమూవీతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

చిత్రం మూవీతో తేజ డైరెక్షన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ తొలిమూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తొలిమూవీతోనే అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

తేజ డైరెక్షన్ లో జయం మూవీతో హీరోగా 2002లో ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా అల్లరి సినిమాతో 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ హీరోగా నిలబడ్డాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన చిరుత మూవీకి ఏ హీరోకి జరగని విధంగా హంగామా సాగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

2006లో దేవదాసు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని తొలిసినిమాతోనే స్టార్ హీరో అయ్యాడు. ఇలియానా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ,నటించిన ఉప్పెన మూవీ 2021లో కరోనా మొదటి వేవ్ తర్వాత రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.

కోరుకున్న ప్రియుడు మూవీతో 1997లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. పోలీస్ సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి రియల్ స్టార్ అయ్యాడు.

కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన సునీల్ అందాలరాముడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. సంపంగి మూవీతో ఎంట్రీ ఇచ్చిన దీపక్ తొలిసినిమాతోనే మంచి విజయాన్ని చూసాడు.

హృదయ కాలేయం మూవీతో హీరోగా వచ్చిన సంపూర్ణేష్ బాబు సినిమాకు ముందు, తర్వాత కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2004లో దొంగ దొంగది మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తొలిసినిమాతోనే మంచి హిట్ కొట్టాడు.

2008లో అష్టాచెమ్మా మూవీతో ఎంట్రీ ఇచ్చిన నాని నేచురల్ స్టార్ గా నిలిచాడు. దగ్గుబాటి వారసుడిగా 2010లో లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

ఉయ్యాలా జంపాల మూవీతో రాజ్ తరుణ్ 2013లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమా తోనే హిట్ కొట్టాడు. 2014లో పిల్లా నువ్వులేని జీవితం మూవీతో ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బాగానే అలరించాడు.

అదే ఏడాది నాగసౌర్య హీరోగా ఊహలు గుసగుసలాడే మూవీ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. పెళ్లిచూపులు మూవీతో 2016లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టి, కొద్దిసమయంలోనే స్టార్ హీరో అయ్యాడు.