MoviesTollywood news in telugu

టాప్ హీరోయిన్ కొడుకును గుర్తు పట్టారా….వెంటనే చూసేయండి

jayasudha son nihar kapoor new movie :ఇండస్ట్రీలో వారసత్వం ఏదో ఒక విధంగా నడుస్తోంది. హీరోల కొడుకులు,కూతుళ్లే కాదు, హీరోయిన్స్, క్యారెక్టర్ యాక్టర్స్,సాంకేతిక నిపుణుల వారసులు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. ఇక ఒకప్పుడు వెండితెరపై సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ అగ్ర నటులందరి సరసన నటించి మెప్పించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మా,అత్త పాత్రలతో జయసుధ మెప్పిస్తోంది. ఆ మధ్య రాజకీయాల్లో కూడా చేరి ఎమ్మెల్యే అయింది. అయితే జయసుధ కొడుకు నీహార్ కపూర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో వలయం లాంటి మూవీస్ లో హీరోగా నటించిన చదలవాడ లక్ష్య ఇందులో హీరోగా చేస్తున్నాడు. నిహార్ డిఫరెంట్ గా నెగెటివ్ షేడ్ లో చేస్తున్నాడు.

నిహార్ నటించిన గ్యాంగ్ స్టర్ గంగరాజు మూవీలో నీహార్ లుక్ ని పోస్టర్ గా అతడి పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసారు. చేతితో కత్తి పట్టి, ముదురు గడ్డంతో భయంకరమైన విలన్ గా నీహార్ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. చదలవాడ పద్మావతి శ్రీ తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది.