క్రేజ్ తో రేంజ్ పెంచేసిన ఉప్పెన హీరోయిన్…బాబోయ్ అంత డిమాండా..!
kriti shetty remuneration :సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఉండాలి గానీ ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోవడమే కాదు,రెమ్యునరేషన్ డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. వాళ్ళకుండే క్రేజ్ అలాంటిది మరి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తూ కొందరు హీరోయిన్స్ తమకున్న క్రేజ్ కి అనుగుణంగా పారితోషికం అడుగుతున్నారు. ఒక్కోసారి హీరోల కంటే హీరోయిన్స్ ఎక్కువ సొమ్ములు చెల్లించే పరిస్థితి వస్తోంది.
తాజాగా ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి కి కూడా అలాంటి డిమాండ్ వచ్చేసింది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి ఈ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంది. బేబమ్మ గా నటించి కేవలం 6లక్షల రూపాయలను రెమ్యునరేష గా తీసుకుంది.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నేచురల్ స్టార్ నానితో నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కోసం 20 లక్షలు డిమాండ్ చేసింది. అంతేకాదు,కింగ్ నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్‌లో నాగచైతన్య సరసన నటించడానికి ఏకంగా రెండు కోట్లు అందుకుంటోందట. దశ ఉంటె ఇలాగే దూసుకుపోతారు మరి. ఇలాగైతే రేపొద్దున్న పెద్ద హీరోయిన్స్ కి ధీటుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

