Movies

ఖరీదైన షూస్ తో మెరిసిన జాన్వీ…ఎంతో తెలుసా ?

సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఖరీదైన వస్తువులు, కార్లు, బైక్ లు వాడుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరి లుక్ వారిపై పడుతోంది.

తాజాగా దివంగత అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు ట్రెండ్ కి అనుగుణంగా కొత్త వాటిని ట్రై చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారిపోతోంది. సాధారణంగా ట్రావెలింగ్ సమయంలో క్రాప్ టాప్, రిప్‌డ్ జీన్స్ లుక్ లో కనిపించే ఈ బ్యూటీ తాజాగా అందరి దృష్టి ఆమె ధరించిన షూస్ వైపు మళ్లేలా చేసింది.

బేసిక్ క్రాప్ టాప్, రిప్‍‌డ్ జీన్స్ మాత్రమే ధరించిన జాన్వీ కపూర్ ఖరీదైన షూస్ తో తళుక్కున సోషల్ మీడియాలో మెరిసింది. ఈమెకే కాదు, బాలీవుడ్ లో స్నీకర్స్ మోజు కాస్త ఎక్కువే. కాస్ట్లీ స్నీకర్స్ క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్లిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ షూస్ ఖరీదు 73వేలట.