సొంత సినిమా థియేటర్స్ ఉన్న4 గురు తెలుగు హీరోస్ వీరే
Tollywood Heroes in Multiplex Business :ఇప్పటి హీరోలు స్టార్ ఇమేజ్ తో వరుస హిట్ మూవీస్ చేస్తూ,మరోపక్క బిజినెస్ లో కూడా ఆరితేరిపోతున్నారు.రెండు చేతులా సంపాదిస్తున్నారు. రెస్టారెంట్స్,హోటల్స్,క్లాత్ బిజినెస్ లను కొందరు హీరోలు ఎంచుకుంటే, మరికొందరు థియేటర్ బిజినెస్ లోకి దిగారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాల్లో దూకుడు పెంచుతూ మరోపక్క ఏషియన్ మూవీస్ తో కల్సి హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో ఏ ఎంబి పేరిట అతిపెద్ద మల్టీ ఫ్లెక్స్ ప్రారంభించాడు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన హంగులతో నిర్మించిన ఏ ఎంబి థియేటర్ 1638 సీట్ల సామర్ధ్యం కల్గి ఉంది. పార్టీ జోన్,స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ ఇలా వివిధ సదుపాయాలున్నాయి. ఇక బన్నీ కూడా ఏషియన్ మూవీస్ తో కల్సి ఏ ఏ ఏ పేరిట అమీర్ పేటలోని సత్యం థియేటర్ ని మల్టీ ప్లెక్స్ గా మారుస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యువి క్రియేషన్స్ తో కల్సి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో భారీ మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేసాడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 106అడుగుల వెడల్పు, 54అడుగుల ఎత్తు గల స్క్రీన్ తో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మించాడు. 3డి సౌండ్ తో 656సీట్ల సామర్ధ్యం ఉంది. అలాగే హీరో విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూనే బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. క్లాత్ మర్చంట్ గా రాణిస్తున్న విజయ్ ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహబూబ్ నగర్ లో ఆధునిక సౌకర్యాలతో భారీ థియేటర్ ని నిర్మించాడు. ఏషియన్ మూవీస్ తో కల్సి ఏవిడి పేరిట థియేటర్స్ స్టార్ట్ చేసాడు.

