MoviesTollywood news in telugu

శ్రీకాంత్ కొడుకు రోషన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా?

Tollywood Hero Srikanth Son Roshan‌ : హీరో శ్రీకాంత్,ఊహ (శివరంజని) ప్రేమించి పెళ్లి చేసుకున్నాక రోషన్ జన్మించాడు. మద్రాసులో 1999మార్చి 13న రోషన్ పుట్టాడు. అతడు పుట్టే నాటికి శ్రీకాంత్ ఫ్యామిలీతో హైదరాబాద్ షిఫ్ట్ కాలేదు. తర్వాత 2000 తర్వాత హైదరాబాద్ వచ్చారు. రోషన్ కి ఓ తమ్ముడు రోహన్, సిస్టర్ మేథ ఉన్నారు. రోషన్ ఎక్కువ అల్లరి చేయడం, సిస్టర్ తో గొడవ పడడం చేసేవాడు.

అయితే శ్రీకాంత్ ఇంట్లో ఉంటె మాత్రం అంతా గప్ చిప్. పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వడం,ఇంట్లో తెలుగు మాట్లాడ్డం,కింద కూర్చుని భోజనం చేయడం వంటి విషయాలను పిల్లలకు నేర్పించారు. రోషన్ ఫుడ్ ఎక్కువ తినేవాడు. అందునా Fry అంటే ఎక్కువ ఇష్టం. క్రమశిక్షణ గల ఫుచర్ కిడ్స్ స్కూల్లో చదివాడు. 10వరకూ అక్కడే చదివాడు.

రోషన్ క్రికెట్ ఆడడం,మట్టిలో ఆడడం,బయట ఫుడ్ తినడం ఇలాంటివన్నీ చేస్తూ సామాన్యంగానే ఉండేవాడు. అండర్ 14విభాగంలో స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడాడు. అయితే సినిమాలు ఎక్కువ చూడడం ద్వారా మక్కువ పెరిగి,క్రికెట్ మీద ఇష్టం తగ్గింది. రుద్రమదేవిలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు.

జి నాగేశ్వరరావు ఓ కథ రెడీ చేసి అఖిల్ కోసం వెళ్తే, వద్దని, వేరేవాళ్ళతో తీద్దామని చెప్పి, వెంటనే రోషన్ గుర్తొచ్చాడు. అతడితో తీయాలని కథ చెప్పమంటే ,నాగేశ్వరరావు వెళ్లి శ్రీకాంత్ కి చెప్పాడు. హీరో కూడా మీ అబ్బాయే అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ఇంటర్ చదువుతున్న రోషన్ కూడా ఒకే చెప్పాడు. శ్రేయ శర్మను సెలెక్ట్ చేసి, ఇద్దరికీ మేకప్, ఫోటో షూట్ టెస్ట్ లు చేసి, నిర్మలా కాన్వెంట్ షూటింగ్ స్టార్ట్ చేసారు.

యాక్టింగ్,డబ్బింగ్ తేడా వస్తే, చెక్ చేసుకుని మళ్ళీ చేయడంతో ఆ చిత్తశుద్ధి నాగార్జునకు, నాగేశ్వరరావుకి నచ్చింది. సుమ కొడుకు రోషన్ కూడా ఇందులో ముఖ్య పాత్ర చేయగా, నాగార్జున కీలక పాత్ర చేసాడు. 2016సెప్టెంబర్ లో నిర్మలా కాన్వెంట్ రిలీజయింది. తొలిసినిమాతోనే హద్దులు మీరకుండా మెచ్యురిటీతో నటించాడు.

తర్వాత ఛాన్స్ లు వచ్చినా స్టడీస్ కి ఇబ్బంది వద్దన్న ఉద్దేశ్యంతో రిజెక్ట్ చేసారు. ఫారిన్ లో ఏడాది యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని, ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, దబన్ 3కి అసిస్టెంట్ గా చేసాడు. 2019లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పెళ్ళిసందD పేరుతొ డిఫరెంట్ మూవీ రోషన్ తీయాలని భావించి శ్రీకాంత్ కి చెబితే ఒకే చెప్పాడు. ఈలోగా కరోనా లాక్ డౌన్, అనంతర పరిణామాల నేపథ్యంలో గౌరీ రోణంకి డైరెక్షన్ లో దర్శకేంద్రుని పర్యవేక్షణలో జులై నాటికి మెల్లిగా సినిమా పూర్తయింది. ఇక ఈ అక్టోబర్ 15న మూవీ థియేటర్లలో సందడి చేసింది.