ట్రెండ్ తగ్గట్టు అప్ డేట్ అవుతున్న టాలీవుడ్ బిగ్ హీరోస్
Tollywood Top Star Heroes : బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ఇన్నాళ్లూ పెద్ద హీరోలు స్మాల్ స్క్రీన్, వెబ్ సిరీస్ మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ బాలీవుడ్ లో ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర నటుడు అక్షయ్ కుమార్ ఏకంగా అమెజాన్ ప్రైమ్‌లో నటించడానికి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం విశేషం. ఇందులో నటించడానికి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్.
ఇక అభిషేక్ బచ్చన్,సైఫ్ అలీ ఖాన్ వంటి వాళ్లు వెబ్ సిరిస్‌లో నటిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కూడా ట్రెండ్‌కు తగ్గట్టు హీరోలు అప్‌డేట్ అయిపోతున్నారు. ప్రస్తుతం సినిమాలకు అమెజాన్,నెట్‌ఫ్లిక్స్,హాట్ స్టార్, జీ 5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో గట్టి పోటీ నెలకొంది. వీటిని గమనిస్తున్న మన హీరోలు కూడా సినిమాలతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ మీద దృష్టి పెడుతున్నారు.
ఇప్పటికే చాలామంది టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్ లోకి వచ్చేసారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్,నాగార్జున,నాని బిగ్‌బాస్‌తో పాటు‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి ప్రోగ్రామ్స్‌తో అలరించారు. అటు చిరంజీవి కూడా చిన్ని తెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించగా,ఇప్పటికే జగపతి బాబు గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్ చేసాడు.
అటు శ్రీకాంత్ ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్‌లో అలరించాడు. తాజాగా వెంకటేష్..తన అన్నయ్య కుమారుడు రానాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తుండగా,దీనికి రానా నాయుడు అనే టైటిల్ పెట్టారు.ఇక నందమూరి నటసింహం నందమూరి నట సింహం బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె ’ అనే టాక్ షో కి రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ కి మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మీ, కుమారుడు విష్ణుతో కలిసి వచ్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో విడులైంది. నవంబర్ 4న ఈ షో స్ట్రీమింగ్ అయింది.
ఇపుడు అదే బాటలో చిరంజీవి కూడా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు టాక్. అంతేకాదు, చిరంజీవి కూతురు సుస్మిత తండ్రి కోసం మంచి వెబ్ సిరీస్ రెడీ చేసిందని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ కోసం డేట్స్ కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నాడట.

