MoviesTollywood news in telugu

కృష్ణ తులసి సీరియల్ ఆనంద్ భూపతి వర్మ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో…?

Krishna Tulasi serial Anand Bhupathi Varma :టీవీలలో సీరియల్స్ కి ఢోకా లేదు. ఎప్పటికప్పుడు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు సీరియల్స్ వస్తున్నాయి. ఇక జి తెలుగులో విజయవంతంగా నడుస్తున్న కృష్ణ తులసి సీరియల్ లో నటీనటులు తమ నటనతో మంచి పాపులార్టీ తెచ్చుకుంటున్నారు. హీరో అఖిల్ కి తండ్రిగా నటిస్తున్న ఆనంద్ భూపతి వర్మ ఆడియన్స్ కి తన నటనతో బాగా దగ్గరయ్యాడు.

ఆనంద్ భూపతి అసలు పేరు జె ఎల్ శ్రీనివాస్. తెలంగాణలోని ఖమ్మంలో రామయ్య, కామేశ్వరి దంపతులకు జన్మించాడు. తండ్రి చార్టర్డ్ ఎక్కౌంటెంట్. తల్లి గృహిణి. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో స్కూల్ విద్య పూర్తి చేసాడు. లా కాలేజీలో ఎల్ ఎల్ బి లో పూర్తిచేసాడు. ఇతడి భార్య పేరు రేవతి. వీరికి సంతోష్, మానస అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రస్తుతం కృష్ణ తులసి, గృహాలక్ష్మి సీరియల్స్ లో నటిస్తున్నాడు. శ్రీనివాస్ వివరాల్లోకి వెళ్తే, స్టడీస్ పూర్తయ్యాక కమల్ హాసన్ హీరోగా స్వాతిముత్యం మూవీలో కె విశ్వనాధ్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. కమల్ కొడుకు పాత్రలో చేసిన శ్రీనివాస్ ఆతర్వాత దాదాపు 40కి పైగా మూవీస్ లో నటించాడు. మంచి డాన్సర్ కూడా అయిన శ్రీనివాస్ ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చాడు. శివుడి క్యారెక్టర్ లో మెప్పించాడు. పెళ్లి పుస్తకం, అన్వేషిత, విధి, శశిరేఖా పరిణయం, కోయిలమ్మ, బంగారు గాజులు వంటి సీరియల్స్ లో నటించాడు.