బంపర్ ఆఫర్ కొట్టేసిన తమన్నా…పారితోషికం ఎంతో తెలిస్తే షాక్…?
Tollywood Heroine tamanna : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్ధమైంది. మరోవైపు చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో చిరంజీవితో కల్సి మిల్కి బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సస్పెన్స్ కి తెరపడింది. గతంలో చిరంజీవితో కలిసి సైరా నర్సింహ రెడ్డి సినిమాలో నటించిన తమన్నాకు మంచి పేరే వచ్చింది.
అయితే సైరా మూవీకోసం తమన్నా ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. చిత్ర యూనిట్ కూడా దాని అంగీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. తాజాగా నటిస్తున్న బోళా శంకర్ మూవీ తమిళంలో సంచలన విజయం సాధించిన వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలను జరిపి, నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇక మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తెలుగు, హిందీ కల్పి 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకుంది. భోళా శంకర్ లో నటిస్తున్న విషయాన్ని తమన్నా కూడా అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
మెగా మాసివ్ సినిమా భోలా శంకర్‌లో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి మరోసారి నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది. దర్శకుడు మెహర్ రమేశ్ గారు దీనిని నిజం చేస్తున్నారు అంటూ తమన్నా ట్వీట్ చేసింది. ఈ సినిమాకి కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.