MoviesTollywood news in telugu

అందాల రాముడు సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో..?

Andala Ramudu Movie : టాలీవుడ్ లో అలీ తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకుని టాప్ కమెడియన్‌గా చక్రం తిప్పుతున్న సమయంలో అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. మర్యాదరామన్న వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసి, మళ్లీ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. నిజానికి కమెడియన్‌గా ఉన్నప్పటికీ సునీల్ డాన్సులకు మంచి క్రేజ్ ఉండేది.

ఇక మాస్ లాంటి సినిమాలలో ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. అలాంటి సమయంలో అందాల రాముడు సినిమాను ఆర్బీ చౌదరి నిర్మాణంలో డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెరకెక్కించాడు. 1996లో లివింగ్ స్టన్, రంభ జంటగా వచ్చిన సుందర పురుషన్ సినిమాకు రీమేక్ చేసిన అందాల రాముడు సంచలన విజయం సాధించింది.

ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 2006లో విడుదలై, సంచలన విజయం సాధించిన ఈ మూవీ అప్పట్లో 13 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దాంతో సునీల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలా సునీల్ కెరీర్‌ను మార్చేసిన ఈ సినిమాను బ్రహ్మాజీ హీరోగా రీమేక్ చేయాలను కున్నారట. అయితే అప్పటికే సిందూరం సినిమా సెట్స్‌పై ఉన్నందున అలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్న సమయంలో కామెడీ సినిమా చేయడం ఇష్టం లేక బ్రహ్మాజీ ఒప్పు కోలేదు.

పైగా సిందూరం విడుదల తర్వాత చేస్తానని అన్నాడే కానీ మళ్లీ ఆ విషయం ప్రస్తావించలేదు. అలా పదేళ్లు గడిచాక సునీల్ హీరోగా రీమేక్ చేసిన అందాల రాముడు మంచి హిట్ అందుకుంది. తర్వాత సునీల్‌కు హీరోగా చాలా ఛాన్స్ లు వచ్చినప్పటికీ మళ్లీ కమెడియన్‌గానే కంటిన్యూ అవుతున్నాడు.