MoviesTollywood news in telugu

పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ కి ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

pushpa movie samantha item-song : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న పుష్ప మూవీలో సమంత స్పెషల్ సాంగ్ ఇప్పటికే సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో అదరగొట్టేస్తోంది. అసలే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, ఇక సమంత తొలిసారిగా స్పెషల్‌ సాంగ్‌ చేయడంతో అంచనా మరింత హెచ్చింది.

‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ అనే సాంగ్ కి సమంత చేసిన డాన్స్ ఉర్రూత లూగిస్తోంది. ఈ పాట కోసం మైత్రి మూవీ మేకర్స్‌ దాదాపు 5కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టారని టాక్. అంతేకాదు, ఈ ఒక్క సాంగ్‌ కోసమే సమంతకు ఏకంగా కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని అంటున్నారు. అలాగే భారీ సెట్టింగ్‌తో విజువల్‌ వండర్‌గా చిత్రీకరించారని చెప్పుకొస్తున్నారు.

ఈ స్పెషల్ సాంగ్ పుష్ప మూవీకి హైలెట్‌గా అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌ 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతుంది. అంతేకాదు,1.6మిలియన్స్‌కి పైగా లైక్స్‌ వచ్చాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్‌ మరింత సందడి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. సమంత గ్లామర్‌, చంద్రబోస్‌ లిరిక్స్‌ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావ‌తి చౌహాన్ మత్తైన గాత్రం మరో ఎత్తు. మొత్తం మీద ఈ సాంగ్ నెట్టింట్లో ట్రెండ్‌ అవ్వడంతో చిత్రబృందం ఖుషీ అవుతోంది.