అల్లు అర్జున్ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరో తెలుసా.?
Tollywood Hero Allu Arjun : పాన్ ఇండియా మూవీ పుష్ప మూవీ రిలీజ్ కి చాలా స్వల్ప సమయమే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పటికే తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులకు బన్నీ సుపరిచితమే అయినా తొలి పాన్ ఇండియా చిత్రం మాత్రం పుష్ప రికార్డు క్రియేట్ చేయనుంది. అందుకే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను ఒకేసారి పెంచేసింది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బన్నీ కొన్ని ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు.
ఇప్పటికే తన చిత్రాలు డబ్ అయి యూట్యూబ్‌లో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, ఫలితంగా ఇప్పటికే పరోక్షంగా బాలీవుడ్‌కి పరిచయం చేశాయని, అయితే తనకు మాత్రం తమిళనాట గెలవాలనుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప చిత్రం పాటలతో కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైందని, ఇందుకు దేవిశ్రీ ప్రసాద్‌కి ధన్యవాదాలు అని బన్నీ చెప్పాడు. రష్మిక మందన హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేయడం ఈ మూవీ రేంజ్ ని ఓ లెవెల్ కి తీసుకెళ్లాయి.
తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకునే బన్నీకి ఇష్టమైన డ్యాన్సర్స్ ఎవరని ప్రశ్నించగా.. ‘తమిళ చలన చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్, విజయ్, ధనుష్, శింబు, శివకార్తికేయన్ బాగా డ్యాన్స్ చేస్తారనేది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు.

