MoviesTollywood news in telugu

నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Nuvvu Naku Nachav MOvie : విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా కె విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చింది.ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుత కథ అందించాడు. ఈ మూవీకి అద్భుత పాటలను కోటి అందించాడు.

ఇక వెంకీ నటన, ఆర్తి అందచందాలు ఆకట్టుకుంటాయి. సునీల్ కామెడీ సరేసరి. 57సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ 18కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. అంతేకాదు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీకి రెండు వారాల ముందుగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో కింగ్ నాగార్జున నటించిన ఆకాశవీధిలో మూవీ రిలీజయింది. రవీనా టాండన్ హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేసాడు.

అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే హీరో వడ్డే నవీన్, రాశి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన చెప్పాలని ఉంది మూవీ కూడా ఇదే రోజు రిలీజయింది. చంద్ర మహేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నువ్వు నాకు నచ్చావ్ మూవీకి ఐదు రోజుల ముందుగా అంటే, సెప్టెంబర్ 1న పవన్ కుమార్ నటించిన చందు మూవీ రిలీజయింది. కె వీరు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశపరిచింది.

జగపతి బాబు, లయ, గజాల నటించిన నాలో ఉన్న ప్రేమ మూవీ కూడా ఇదే ఈరోజున వచ్చింది. వి ఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ హిట్ గా నిల్చింది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.

మోహన్ బాబు, నాగార్జున నటించిన అధిపతి మూవీ నువ్వు నాకు నచ్చావ్ మూవీకి 13రోజుల తర్వాత వచ్చి, ప్లాప్ అయింది. దీంతో పాటు వచ్చిన ఇదే నా మొదటి ప్రేమలేఖ మూవీ కూడా ప్లాప్ అయింది. నువ్వు నాకు నచ్చావ్ కి రెండు వారాల తర్వాత చిరంజీవులు మూవీ వచ్చింది. రవితేజ, బ్రహ్మాజీ, శివాజీ ప్రధానంగా నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది