తారక్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా ?
Ntr Watch price : సెలెబ్రిటీలు బ్రాండెడ్ వస్తువులను ఎంత రేటు పెట్టి అయినా కొనడంలో దిట్ట. హీరోలు, హీరోయిన్స్ ఈ మధ్య బ్రాండ్ల విషయంలో తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఇప్పటికే కార్లు, బైకులు, షూస్, వాచీల విషయంలో వార్తల్లో నిల్చిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో తారక్ చేతికి ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది.
ఆ వాచ్ చాలా భిన్నంగా కన్పించింది. చాలా కాస్టలీ వాచ్ కదా అని నెటిజన్స్ సెర్చ్ చేసి, షాకయ్యారు. రిచర్డ్ మిల్లీ ఆర్ఎమ్ 11 వాచ్ ధర ఏకంగా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అంటే రూ. 39,932,935లు. డాలర్లలో చూస్తే 5,14,800 డాలర్లన్న మాట. ఇంత సొమ్ముంటే ఏకంగా ఇళ్లు కట్టేసుకోవచ్చు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీని బాహుబలి రేంజ్లో హిట్ చేయాలని మూవీ టీమ్ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ప్రమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే సినిమా విడుదలకు ఇంకా నెలరోజుల సమయం ఉన్నా. ఇప్పటినుండే ప్రెస్ మీట్స్‌తో అదరగొడుతున్నారు.
ఆ సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ, వారి ప్రశ్నలకు చిత్ర బృందం ఓపిగ్గా, నేర్పుగా సమాధానం ఇస్తోంది. అసందర్భంలోనే తారక్ వాచ్ పై అందరి కన్ను పడింది.

