ముసిముసి నవ్వులతో ముద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా…?
Tollywood Heroine Aditi rao hydari : ఈమధ్య సోషల్ మీడియాలో హీరోల కంటే హీరోయిన్స్ చిన్నప్పటి ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఫాన్స్ కి కూడా చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. పైగా ఫాన్స్ తో కూడా లైవ్ లో మాట్లాడుతున్నారు. మొత్తమీద ఫాన్స్ కి, స్టార్స్ కి మధ్య సోషల్ మీడియా మంచి వారధి గా మారింది.
తాజాగా మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అదితిరావ్ హైదరి చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. తాజాగా మహాసముద్రం సినిమాలో మెప్పించిన ఈ బ్యూటీ ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ, అదరగొడుతోంది.
నిజానికి తెలుగులో ఎంట్రీ ఇవ్వక ముందే హిందీ, తమిళ్ సినిమాల్లో నటించిన అదితిరావ్ కి చెలియా మూవీ తెలుగులో డబ్ అవ్వడం ఓ విధంగా కల్సి వచ్చింది. దాంతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాలో డైరెక్ట్ గా నటించి, మంచి విజయాన్ని అందుకుంది.

