Beauty Tips

Hair Fall Tips:7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గి పలచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా,పొడవుగా మారటం ఖాయం

Hair Fall And Growth Tips : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. దాంతో కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటిని ఉపయోగించడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. జుట్టు రాలకుండా., తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఇప్పుడు చెప్పే నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
cococnut Oil benefits in telugu
పొయ్యి మీద ఒక ఇనుప కడాయి పెట్టాలి. దానిలో 100 ML కొబ్బరి నూనె పోయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల మందార పొడి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల గుంటగలగరాకు పొడి వెయ్యాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నూనె చల్లారాక వడగట్టి సీసాలో నిలువ చేసుకోవచ్చు. Hair fall Tips in telugu
ఈ నూనెను రోజు విడిచి రోజు జుట్టుకు పట్టించి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మందార పువ్వులను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు… లేదంటే మార్కెట్లో దొరికే కెమికల్స్ లేని మందార పొడిని వాడవచ్చు.
White Hair Tips
మందార పువ్వు పూర్వ కాలం నుండి జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.
ఇక గుంటగలగరాకు తెచ్చుకుని పొడిగా చేసుకోవచ్చు…లేదంటే మార్కెట్లో దొరికే పొడిని వాడవచ్చు. ఇది కూడా జుట్టు రాలే సమస్యలు తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
hair fall tips in telugu
ఈ నూనెను వాడితే జుట్టు రాలే సమస్య,చుండ్రు,తెల్ల జుట్టు సమస్య ఇలా జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.