MoviesTollywood news in telugu

Megastar ఖైదీ నెంబర్ 150 సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Megastar Chiranjeevi Khaidi No 150 Movie : మెగాస్టార్ సినిమాలు అంటే ఇప్పటికి అదే క్రేజ్ ఉంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. బాస్ ఈజ్ బాక్ అనే టాగ్ లైన్ తో రాజకీయాల నుంచి సినిమా రంగంలోకి ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

వివి వినాయక్ డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో చిరంజీవి 60 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా స్పెప్స్ ఇరగదీసాడు. చిరంజీవి ద్విపాత్రిభినయం చేసిన ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది.

2017జనవరి 11న రిలీజై, 150కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2016డిసెంబర్ 30న అల్లరి నరేష్ నటించిన చెట్టుమీద దెయ్యం నాకేం భయ్యం మూవీ వచ్చింది. జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ప్లాప్ అయింది.

డిసెంబర్ 30నే కారం దోశె మూవీ రిలీజయింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే నేనొస్తా మూవీ కూడా ప్లాపయింది. నారా రోహిత్, శ్రీవిష్ణు నటించిన సాగర్ కె చంద్ర తెరకెక్కించిన అప్పట్లో ఒకడుండేవాడు మూవీ ఏవరేజ్ అయింది. ఖైదీ నెంబర్ 150కి ఐదు రోజుల ముందు ఇంకేంటి నువ్వే చెప్పు మూవీ రిలీజయింది.

శివశ్రీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్లాపయింది. మనోజ్ నందన, స్మిత జంటగా నటించిన ఏ రోజు నిన్ను చూశానో మూవీ కూడా నిరాశపరిచింది. జనవరి 6నే పడమటి సంధ్యారాగం మూవీ వచ్చింది. ఇదీ పరాజయం పాలైంది. ఖైదీ నెంబర్ 150కి ఒకరోజు తర్వాత జనవరి 12న బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ రిలీజయింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ 70కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.

జనవరి 14న ఆర్ నారాయణ మూర్తి నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజయింది. జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పరాజయం పాలైంది. జనవరి 14న వచ్చిన శతమానం భవతి మూవీ 50కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది.

సతీష్ వేగేశ్న డైరెక్టర్. ఇక హృత్రిక్ రోషన్ నటించిన బాలీవుడ్ మూవీ కబిల్ కి డబ్బింగ్ గా వచ్చిన బలం మూవీ ఏవరేజ్ గా నిల్చింది. మంచు విష్ణు నటించిన లక్కున్నోడు మూవీ ఆకట్టుకోలేదు. దీనికి రాజ్ కిరణ్ డైరెక్టర్.