MoviesTollywood news in telugu

Mahesh babu డూప్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Mahesh babu dupe srinu in Telugu : స్టార్ హీరోలను, స్టార్ హీరోయిన్లను పోలిన వ్యక్తులను దర్శకులు ఎన్నుకుని సినిమాల్లో డూప్ గా పెట్టడం రివాజు. అలనాడు ఎన్టీఆర్ కి కైకాల సత్యనారాయణ డూప్ గా వేసేవారని అంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాల్లో మహేష్ కు డూప్ గా చేసే జూనియర్ ఆర్టిస్ట్ శ్రీను కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన రాజకుమారుడు మూవీ నుంచి తాను మహేష్ కు డూప్ గా చేస్తున్నానని, ఓ స్టార్ హీరోకు డూప్ గా నటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని శ్రీను చెబుతూ, మహేష్ ఫ్యాన్స్ లాక్ డౌన్ సమయంలో తనకు కొంత మొత్తం సహాయం చేశారని తెల్పాడు. అయితే నిర్మాతలు తనకు ఏదైనా పని ఇచ్చి ఆదుకోవాలని శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉద్వేగానికి గురయ్యాడు.

లాక్ డౌన్ కి ముందు నెలకు 5 ప్రోగ్రామ్ లు చేసేవాడినని, కరోనా వల్ల ప్రోగ్రామ్ లు లేకపోవడంతో ఆదాయం తగ్గిందని శ్రీను చెప్పాడు. తనకు ముగ్గురు పిల్లలని భార్యా పిల్లలను పోషించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శ్రీను చెప్పుకొచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ, ఖర్చులు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న తనలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని శ్రీను తెల్పాడు.