Tollywood Hero: లేడీ గెటప్ లో కనిపిస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా..?
Tollywood Hero sumanth : Sumanth ఈ మధ్య వచ్చిన Sita Ramam సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కినేని నాగేశ్వరావు మనవడిగా నాగార్జున మేనల్లుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. సుమంత్ మొదట్లో సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకో లేకపోవటంతో పరాజయాలు పలకరించాయి. సుమంత్ లో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. తాజాగా సుమంత్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014వ సంవత్సరంలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన “ఏమో గుర్రం ఎగరావచ్చు” చిత్రంలో లేడీ గెటప్ లో నటిస్తున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోయినప్పటికీ సుమంత్ అక్కినేని పాత్రకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

