Skip to content
Friday, February 27, 2026
Latest:
  • IRCTC Agent: IRCTC ఏజెంట్‌గా మారండి.. నెలకు రూ.60,000 వరకు సంపాదించే గోల్డెన్ ఛాన్స్!
  • Comb Cleaning Tips:జిడ్డు పట్టిన దువ్వెనలను ఈజీగా క్లీన్ చేయండిలా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు!
  • IRCTC బంపర్ ఆఫర్: కేవలం రూ.14 వేలకే ‘దక్షిణ భారత యాత్ర’.. భోజనం, రూమ్, టికెట్ అన్నీ కవరే!
  • Holi Pichkari Water Gun:రూ.2,999 విలువ గలది కేవలం రూ.847 కే.. 72 శాతం తగ్గింపుతో..
  • Alovera For Face:మొటిమలు, ముడతలు బాధిస్తున్నాయా? మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే ‘కలబంద’ మ్యాజిక్ ఇదే!
Chai Pakodi

  • Beauty Tips
  • Devotional
  • Amazon Offers
  • Health
  • Politics
  • Business
  • Kitchen
  • Privacy Policy
  • Web Stories
suresh-production logo
MoviesTollywood news in telugu

సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనక ఉన్నSTORY ఏమిటో తెలుసా?

February 10, 2023 Admin

suresh production logo :ఏ సంస్థకైనా లోగో అతి ముఖ్యమైనది. దానిని తయారుచేయించడంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇక తెలుగు సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్ కు చాలా కీలకమైన పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 55 ఏళ్ల క్రితం రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ లో ఎన్నో అద్బుత చిత్రాలు నిర్మాణం జరిగాయి.

అత్యధిక భాషలో సినిమాలు నిర్మించి అరుదైన గిన్నీస్ రికార్డును సైతం రామానాయుడు దక్కించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో పలు భాషల్లో, ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు రూపొందాయి. అయితే అన్ని సినిమాల ఆరంభంలో వచ్చే సురేష్ ప్రొడక్షన్స్ లోగోపై ఉండే పిల్లల గురించి మాత్రం ఎవరికి పెద్దగా తెలియదు.

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనుక ఉన్న కథను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. ‘నేను, తమ్ముడు వెంకటేష్ స్కూల్ కు వెళ్తున్న సమయంలో నాన్న గారు పిలిచారు. అప్పటికే అక్కడ ఎస్ మరియు పీ రెండు అక్షరాలు ఉన్నాయి. చెరో అక్షరంపై ఎక్కమని సూచించారు. ఆయన సూచన మేరకు నేను పీ అక్షరంపై తమ్ముడు వెంకటేష్ ఎస్ అక్షరంపై నిల్చున్నాం.

ఆ తర్వాత ఫొటోలు తీయించి, వాటిని లోగోగా తయారు చేయించారు’అని సురేష్ బాబు చెప్పారు. అయితే యాదృశ్చికంగా జరిగినా ఎస్ పై నిల్చున్న వెంకటేష్ స్టార్ అయ్యాడు.. పి అక్షరంపై నిల్చున్న నేను ప్రొడ్యూసర్ ను అయ్యానంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ‘ఇక సినిమా షూటింగ్స్ విషయాలు నిర్మాణం గురించి నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు.

ఆసక్తి లేకపోవడంతో పెద్దగా ఆ విషయాలను తెలుసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే నాన్న గారు సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందిన సినిమాల రోజూ వారి కలెక్షన్స్ నాకు ఇస్తే వాటిని నేను ఒక నోట్ బుక్ లో ఎక్కించాల్సి ఉండేది. అలా నా సినిమా ప్రొడక్షన్ పని మొదలయ్యింది. కాలేజ్ డేస్ లో  సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి మరింత లోతుగా దిగా. అలా నా సినిమా రంగ ప్రవేశం జరిగిపోయింది’అని సురేష్ బాబు వివరించాడు.

  • ఈ పాలను తాగితే కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు, కండరాల నొప్పులే కాకుండా calcium లోపం ఉండదు
  • మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క ఎంత మేలు చేస్తుందో…సర్వరోగ నివారిణి

Recent Posts

  • IRCTC Agent: IRCTC ఏజెంట్‌గా మారండి.. నెలకు రూ.60,000 వరకు సంపాదించే గోల్డెన్ ఛాన్స్!
  • Comb Cleaning Tips:జిడ్డు పట్టిన దువ్వెనలను ఈజీగా క్లీన్ చేయండిలా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు!
  • IRCTC బంపర్ ఆఫర్: కేవలం రూ.14 వేలకే ‘దక్షిణ భారత యాత్ర’.. భోజనం, రూమ్, టికెట్ అన్నీ కవరే!
  • Holi Pichkari Water Gun:రూ.2,999 విలువ గలది కేవలం రూ.847 కే.. 72 శాతం తగ్గింపుతో..
  • Alovera For Face:మొటిమలు, ముడతలు బాధిస్తున్నాయా? మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే ‘కలబంద’ మ్యాజిక్ ఇదే!
  • Weight Loss:వేలాడే పొట్ట, నడుము కొవ్వు కరగాలా? ఈ ‘న్యాచురల్ డ్రింక్’తో 5 రోజుల్లోనే మార్పు గమనించండి!
  • Gold Jewellery:2026లో బంగారం కొంటున్నారా? ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే తక్కువ ధరకే బెస్ట్ జ్యువెలరీ మీ సొంతం!
  • PAN Card Corrections:మీ PAN Card లో తప్పులున్నాయా? ఆఫీసుల చుట్టూ తిరక్కుండా మొబైల్‌లోనే ఇలా ఈజీగా మార్చుకోండి!
  • Cervical Neck Pillow:రూ.3,999 విలువ గలది కేవలం రూ.1,298కే.. 68 శాతం తగ్గింపుతో..
  • South Indian Bank Recruitment 2026: రాత పరీక్ష, ఫీజు లేదు! డిగ్రీ ఉంటే చాలు.. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో అదిరిపోయే జాబ్ ఛాన్స్!
Copyright © 2026 Chai Pakodi. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.