MoviesUncategorized

సంతోషం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Santosham movie child artist:సినిమా రంగంలో హీరో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగానే చైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. ముద్దు ముద్దు మాటలతో తమ హావభావాలతో జనాన్ని కదిల్చేలా చిన్నారులు నటించి మెప్పిస్తుంటారు. చిన్నప్పుడు సినిమాల్లో నటించి పెద్దయ్యాక  కూడా మంచి నటీనటులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీదేవి మొదలుకుని ఎందరో చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ నుంచి ఉన్నత స్థితికి చేరారు. ఇక కింగ్ నాగార్జున హీరోగా నటించిన సంతోషం మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వేసి, అందరినీ అలరించిన చిన్నారి పేరు అక్షయ్. 

సంతోషం సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది. మంచి ప్రేమికుడిగా ,భర్తగా,మంచి తండ్రిగా నాగార్జున నటన హైలెట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయిన ఈమూవీలో నాగ్ కొడుకుగా అక్షయ్ నటించి అందరి మెప్పు పొందాడు. కళ్ళకు అద్దాలు పెట్టుకుని బొద్దుగా కనిపించిన అక్షయ్ ఇప్పుడెలా ఉన్నాడో,ఏంచేస్తున్నాడో తెలుసా? సంతోషం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వర్షం మూవీలో నటించాడు.
ఇక ఆతర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన అక్షయ్, ప్రభుదేవా డైరెక్షన్ లోని మూవీలో హీరోయిన్ తమ్ముడు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.

అలా అందరిని అలరించిన అక్షయ్ ఇప్పడు పెరిగి పెద్దోడయ్యాడు. 21ఏళ్ళ అక్షయ్ సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ లో చేస్తున్నాడు. మ్యూజిక్ ఆల్బమ్ లో చేసాడు. మోడల్ గా కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. హిందీలో హిట్ అయిన సీరియల్  ఈతరం ఇల్లాలు  తెలుగులో ప్రసారం చేస్తున్నారు. ఇందులో అగర్వాల్ పాత్రలో అక్షయ్ నటించాడు. మహాభారతంలో కూడా ఓ పాత్ర వేసాడు. ఇక సినిమాల్లో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. చూద్దాం హీరోగా ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తాడో.