Beauty Tips

ఈ ఆకును దంచి పెరుగులో కలిపి జుట్టుకి పట్టిస్తే జీవితంలో జుట్టు రాలే సమస్య ఉండదు

Hair Fall Tips In Telugu : జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చిట్లటం, పొడిగా మారటం, బట్టతల వంటి సమస్యలు చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా విసుగు వస్తుంది. ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
Menthi Kura Health benefits in telugu
ఈ చలికాలంలో మెంతి కూర చాలా విరివిగా లభ్యం అవుతుంది. మెంతి కూరలో ఉండే నికోటిన్ చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. మెంతి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో పెరుగు కలిపి జుట్టుకి బాగా పట్టించాలి. పావుగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
curd benefits in telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు ఇలా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మెంతి కూర దొరకని వారు రాత్రి సమయంలో ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతి పిండి కలిపి అలా వదిలేయలి.
hair fall tips in telugu
మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. పావుగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.
Hair Care
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.