Beauty Tips

Head Bath:తలస్నానం చేసినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా… తెలిస్తే జీవితంలో అసలు చేయరు

Hair Bath and care Tips : మనిషికి మరింత అందాన్ని పెంచే శిరోజాలు అంటే అందరికి మక్కువే.అందులోనూ ఆడవాళ్ళూ వాళ్ళ కోరుకున్న జుట్టు కోసం ఎన్నో షాంపూలు, ఆయిల్స్ ను వాడుతుంటారు.కాని తలస్నానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమాలను పాటించాలి.సాధారణంగా మనకి తలస్నానం చేసినప్పుడు చాలా హాయి గా ఉంటుంది.మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది.

నిద్ర‌పోయే ముందు త‌ల‌స్నానం చేస్తే చ‌క్క‌ని నిద్ర సొంత‌మ‌వుతుంది. అయితే కొంద‌రు మాత్రం త‌ల‌స్నానం చేసేందుకు బద్ధకిస్తారు. ముఖ్యంగా స్త్రీలు అయితే త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. దీని వ‌ల్ల వెంట్రుక‌లు రాలిపోవ‌డం, జుట్టు త‌క్కువ‌గా అవ‌డం, శిరోజాలు కాంతిని కోల్పోవ‌డం జ‌రుగుతుంది. అలాంటి వారు త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.
Hair Care
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తలస్నానానికి చాలా మంది వేడినీళ్లనే ఉప‌యోగిస్తుంటారు కాని అలా చేయకూడదు. త‌ల‌స్నానానికి కేవ‌లం గోరు వెచ్చ‌ని లేదా చ‌ల్ల‌ని నీటిని మాత్ర‌మే వాడాలి. ఎందుకంటే వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా పొడిగా మారుతాయి. క‌నుక వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది.

దీని వల్ల షాంపూ, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. షాంపూతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి అంటే ఎక్కువ సేపు నీళ్ళతో జుట్టును నానబెట్టాలి అన్న మాట ,షాంపూను తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి.
hair fall tips in telugu
ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. అప్పుడు జుట్టులో ఉన్న దుమ్ము ధూళి తొందరగా వదిలి మ‌నం అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు. దీని వల్ల శిరోజాలు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. ఈ విధంగా తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగి కాంతివంతగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Amazon Best Offers
https://amzn.to/3zgeuGf