Beauty Tips

Face Glow Tips:చింతపండుతో ఇలా చేస్తే ముఖం,మెడ మీద ఉన్న సన్ టాన్, మురికి,జిడ్డు 5 నిమిషాల్లో మాయం

Tamarind face pack: ముఖం మీద సన్ టాన్ వచ్చి ముఖం నల్లగా మారిపోతుంటుంది. అలాగే దుమ్ము,ధూళి కూడా ముఖాన్ని జిడ్డుగా మార్చేస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి బ్యూటీ పార్లర్ కు వెళ్తే చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. .

చింతపండు సన్ టాన్ తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చింతపండును నీటిని పోసి నానపెట్టి గంట అయ్యాక గుజ్జు తీసుకోవాలి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ చింతపండు గుజ్జు, అర స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి, అర స్పూన్ ముల్తానా మట్టి, రెండు స్పూన్ల పెరుగు, అర స్పూన్ తేనె వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి.
Sun Tan
ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసి పది నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సన్ టాన్ రిమూవ్ అవటమే కాకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అలాగే ముఖం మీద దుమ్ము,ధూళి,జిడ్డు,మురికి అన్నీ తొలగిపోయి ముఖం మెరుస్తుంది.
Chintapandu
చింతపండు గుజ్జు సన్ టాన్ తొలగించడమే కాకుండా మంగు మచ్చలు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
Young Look In Telugu
చింతపండు చర్మానికి పోషణ అందించి, మాయిశ్చరైజ్ చేసి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. చింతపండులో ఉండే పోషకాలు చర్మ కణాలలో (Skin cells) పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మంపై ఏర్పడిన మొటిమలు, మచ్చలు, వలయాలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Amazon Best Offers
https://amzn.to/3zgeuGf