అటు తండ్రి, ఇటు కొడుకుతో హీరోయిన్లుగా భామలు…ఎంత మందో…?
Tollywood Movies:సాదారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువకాలం సినీ పరిశ్రమలో ఉండటం కష్టమే. హీరోయిన్ గా కొంత కాలం నటించాక అక్క,చెల్లి,వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే కొంతమంది హీరోయిన్స్ రెండు జనరేషన్ హీరోలతో నటించారు. ఇప్పుడు వారి వివరాలు తెలుసుకుందాం.
1. శ్రీదేవి,అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున
శ్రీదేవి,అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు నాగార్జునతో కలిసి ‘గోవిందా గోవిందా’, ‘ఆఖరి పోరాటం’ సినిమాల్లో నటించింది.
2అనుష్క,వెంకటేష్,రానా
అనుష్క వెంకటేష్ తో ‘చింతకాయల రవి’ సినిమలో నటించింది. అదే అబ్బాయితో ‘రుద్రమదేవి’ సినిమాలో నటించింది.
3. తమన్నా,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్
తమన్నా పవర్ స్టార్ తో ‘కెమెరా మాన్ గంగతో రాంబాబు’ సినిమాలో నటించింది. అదే అబ్బాయితో ‘రచ్చ’ సినిమాలో జోడి కట్టింది.మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కలిసి నటించింది.
4. నయనతార, బాలకృష్ణ,ఎన్టీఆర్
నయనతార బాలకృష్ణ తో సింహ,శ్రీ రామరాజ్యం సినిమాల్లో జోడి కట్టింది. ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ లో నటించింది.
5. శ్రియ, బాలకృష్ణ,ఎన్టీఆర్
శ్రియ బాలకృష్ణ తో చెన్న కేసవరెడ్డి సినిమాలో నటించింది. అలాగే అబ్బాయితో ‘నా అల్లుడు’ సినిమాలో నటించింది.
6. త్రిష,బాలకృష్ణ,ఎన్టీఆర్
త్రిష,బాలకృష్ణ తో కలిసి ‘లయన్’సినిమాలో నటించింది. ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో కలిసి ‘దమ్ము’ సినిమాలో నటించింది.
7. కాజల్, చిరంజీవి,రామ్ చరణ్
‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు… చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా నటించింది.
8. రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున, నాగ చైతన్య
నాగచైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించిన ఈ సుందరి… నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో కలిసి నటించింది.
9. జెనీలియా, venkatesh, రానా
వెంకటేష్ సరసన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాలో కలిసి నటించిన ఈ అమ్మాయి… రానాతో కలిసి ‘నా ఇష్టం’ సినిమాలో నటించింది.

