BRO OTT Release : బ్రో ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఎందులో వస్తుందంటే…
BRO OTT Release : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్(Sai Dharam Tej) తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు వెళ్ళుతున్న ఈ సినిమాలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలానే ఉన్నాయి.
సముద్రఖని(Samudrakhani) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అయితే అభిమానులు ఈ సినిమా ఏ OTT లో వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు అధిక మొత్తంలో చెల్లించి నెట్ ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదల అయినా నాలుగు వారాలకు నెట్ ఫ్లిక్స్(Netflix) లో వస్తుందని సమాచారం. అయితే సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జీ తెలుగు(Zee Telugu) శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

