Phone Charging: ఫోన్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ విషయాన్నీ తెలుసుకోండి
Phone Charging Mistakes:మనలో చాలా మంది Phone చార్జింగ్ పెట్టే సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అసలు Phone కి చార్జింగ్ రోజుకి ఎన్ని సార్లు పెట్టాలి. Phone చార్జింగ్ పెట్టటానికి సరైన మార్గం ఉంది. ఇప్పుడు చెప్పిన విధంగా చార్జింగ్ పెడితే Phone బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది.
మనలో చాలా మంది ఫోన్ చార్జింగ్ కొంచెం తగ్గగానే వెంటనే చార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టటం వలన ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఫోన్ చార్జింగ్ రోజులో ఎన్ని సార్లు పెట్టాలి…అనే విషయానికి వస్తే ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
బ్యాటరీ 20% లేదా అంతకంటే ఎక్కువ పడిపోకుండా చూసుకోవాలి. బ్యాటరీ స్థాయి 80% (లేదా అంతకంటే తక్కువ) మరియు 100% మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఛార్జర్ నుండి ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయండి. ఫోన్ 100 శాతం చార్జింగ్ అయ్యిన వెంటనే ఛార్జర్ నుండి తీసివేయండి. చార్జింగ్ విషయంలో చాలా మంది 20-80 నియమాన్ని పాటిస్తూ ఉంటారు.
అంటే బ్యాటరీ చార్జింగ్ 20 శాతం ఉన్నప్పుడు చార్జింగ్ లో పెట్టి…80 శాతం వచ్చాక చార్జింగ్ తీసేస్తూ ఉంటారు. ఈ విధానం కరెక్ట్. అలాగే 45-75 నియమాన్ని కూడా అనుసరించవచ్చు. ఈ రెండింటిలో ఏ విధానం అయినా మంచిదే.

