MoviesTollywood news in telugu

Guppedantha Manasu: ‘గుప్పెడంత మనసు’ ఏంజెల్ గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

Guppedantha Manasu Serial:గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షక ఆదరణతో ముందుకు దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో ఏంజెల్ పాత్రలో నటించిన అవంతిక ముందుగా సినిమాల్లో ప్రయత్నం చేసి…ఆ తర్వాత సీరియల్స్ లోకి వచ్చి మంచి పేరును సంపాదించింది. అవంతికకు సినిమాల్లో రాని గుర్తింపు ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో అందుకుంది.

గుప్పెడంత మనస్సు సీరియల్ కి ముందు అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు వంటి సీరియల్స్‌లో ఇంపార్టెంట్స్ రోల్ చేసింది. రొమాంటిక్ క్రిమినల్స్, ‘అబ్బో నా పెళ్లంట’,ఐపీఎల్, అంతేలే కథ అంతేలే, బీకాంలో ఫిజిక్స్ వంటి సినిమాల్లోనూ నటించింది. ఎన్ని సినిమాల్లో నటించిన గుర్తింపు ఒక్క సీరియల్ తో వచ్చింది.

గుప్పెడంత మనస్సు సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రిషి వసుధారకు ఏమైనా చెప్పాలంటే ఏంజెల్ కి చెప్పుతూ ఉంటాడు. అప్పట్లో గౌతం పాత్ర ఎలా కీలకంగా ఉందో..ఇప్పుడు కూడా ఏంజెల్ పాత్ర కూడా అలాగే డిజైన్ చేసారు.