White Hair Turn Black:కొబ్బరి నూనెలో ఈ ఆకును మరిగించి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం.
White Hair Turn Black:తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ప్రయత్నం చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు. ఆ ఉత్పత్తుల కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే సరిపోతుంది.
మనం రెగ్యలర్ గా ప్రతి రోజు ఉపయోగించే కొబ్బరి నూనె,కరివేపాకును ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి మరియు బీటా-కెరాటిన్తో జుట్టు కుదుళ్లలో మెలమైన్ వర్ణద్రవ్యంను పునరుద్ధరన చేయటానికి సహాయపడుతుంది. దాంతో తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు కూడా తెల్లజుట్టును నల్లగా మార్చుతాయి. ఒక గిన్నెలో కరివేపాకు, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని బాగా మరిగించి మిశ్రమం నల్లగా మారే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెను జుట్టు మరియు తలపై మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి పలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/

