MoviesTollywood news in telugu

Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఎప్పుడు అంటే..

Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానున్నదని వార్తలు వస్తున్నాయి. November 12 న విడుదల అయినా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్‍గా చేశారు. అయితే, టైగర్-3 మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ఓ స్పెషల్ డేను సెలెక్ట్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి. టైగర్ 3 సినిమాను డిసెంబర్ 31వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ సినిమాలో స్పై ఏజెంట్లుగా సల్మాన్, కత్రినా కైఫ్ యాక్షన్ సీన్లు టైగర్-3కి హైలైట్‍గా నిలిచాయి. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియోలు కూడా ఆకట్టుకున్నాయి.