MoviesTollywood news in telugu

Tollywood:చాలా చిన్న వయస్సులో ఎంట్రీ ఇచ్చిన భామలు…ఏ వయస్సులో…?

Tollywood Heroines age :సినిమా పరిశ్రమకు రావటం ఒక ఎత్తు…ఆ తర్వాత సక్సెస్ అవ్వటం మరొక ఎత్తు. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎంతో కష్టపడాలి, ఒకవేళ వచ్చినా, టాలెంట్ తో పాటు అదృష్టం కల్సి రావాలి. లేకుంటే రాణించడం కష్టం. ఇక అతి తక్కువ వయసులో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సత్తా చాటిన వాళ్ళు కూడా ఉన్నారు.

ఇందులో మొదటగా అప్పటి అందాల తార, చాలామంది దర్శకులకు కలల రాణి అయిన శ్రీదేవి బాలనటిగా రాణించి, 13 ఏళ్ళ ప్రాయంలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తన నటనతో,అందంతో ఎందరో అగ్ర హీరోల సరసన మెప్పించి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు చాలా భాషల్లో శ్రీదేవి తన సత్తా చాటింది.

ఛార్మి, తమన్నా, హన్సిక, శ్వేతా బసు ప్రసాద్, సాయేషా సైగల్ నందిత రాజ్, కృతి శెట్టి 20 సంవత్సరాల లోపు వయస్సు లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఛార్మి 15ఏళ్ళ వయస్సులోనే ‘నీతోడు కావాలి’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మిల్కి బ్యూటీ తమన్నా కూడా 15 ఏళ్ళ ప్రాయంలోనే ‘చంద్ర సార్ ఓషన్’ అనే సినిమాలో నటించింది.

ఇక దేశముదురు సినిమాలో బన్నీ జోడీగా మెప్పించిన హన్సిక కూడా 16 వ ఏట ఇండస్ట్రీకి వచ్చింది. కొత్త బంగారులోకం సినిమాలో వరుణ్ సందేశ్ సరసన నటించిన శ్వేతా బసు ప్రసాద్ 17 వ ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తాజాగా ఉప్పెన సినిమాలో వైష్ణవ తేజ్ కి జోడీ కట్టిన కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ లు కొట్టేసింది.