Movies

Tollywood:నక్సలైట్ల పాత్రలో మెరిసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు

Tollywood Movie News:గతంలో నక్సలైట్ల పాత్రల్లో హీరో హీరోయిన్స్ ఇష్టపడి మరీ నటించేవారు. స్టార్ హీరోలు,హీరోయిన్స్ కూడా నక్సల్స్ పాత్రలో ఒదిగిపోయి వన్నె తెచ్చారు. హీరోయిన్స్ విషయంలో లేడి అమితాబ్ విజయశాంతి,రోజా చాలా ఉత్సాహంగా నక్సలైట్స్ పాత్రలో ఒదిగిపోయేవారు.

పైగా ఉద్యమం జోరుగా ఉన్న సమయం,దానికితోడు మాస్ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని ఉబలాటపడి ఈ పాత్రల్లో నటించేవారు. అదొక ట్రెండ్ గా నడిచింది. అతిలోక సుందరి శ్రీదేవి మొదలుకుని నేటి సాయిపల్లవి వరకూ చాలామంది నక్సల్ పాత్రలు వేశారు.

ఇక 90వ దశకంలో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న శ్రీదేవి హిందీ మూవీలో నక్సల్ పాత్ర పోషించింది. ఇది తెలుగులో నక్సలైట్ దుర్గ పేరిట అనువాదమైంది. ఇక ఆతర్వాత సూపర్ కృష్ణ కంచు కాగడా మూవీలో ఇదే తరహా పాత్ర పోషించి మెప్పించింది. ఆతర్వాత శ్రీదేవి బాటలోనే విజయశాంతి నక్సల్స్ పాత్రలో నటించింది.

ఒసేయ్ రాములమ్మ మూవీ ఎంతటి పెద్ద హిట్ మూవీగా నిల్చిందో చెప్పక్కర్లేదు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించింది. ఆతర్వాత అడవిచుక్క మూవీలో ఇదే తరహా పాత్రలో మెప్పించింది.

తర్వాత రోజా కూడా నక్సల్స్ పాత్రలో ఒదిగిపోయింది. అడవిలో అన్న,స్వర్ణక్క,ఎంకౌంటర్ వంటి చిత్రాలలో నక్సలైట్ పాత్రలో తళుక్కున మెరిసింది. అయితే ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం పెద్దగా లేదు, ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది.

ఇక ఇలాంటి పాత్రలో చేసే గట్స్ ఎవరికీ లేవు. నిర్మించేవారు లేరు. అయితే తాజాగా రానా హీరోగా వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కుస్తున్న విరాటపర్వం మూవీలో సాయిపల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుందట. మరి సాయిపల్లవికి ఎలాంటి ఇమేజ్ వస్తుందో చూడాలి. ఇక 1990దశకంలో జరిగిన యదార్ధ ఘటనను తెరకెక్కిస్తున్నారట.