Pancake Pillow:దిండు నచ్చిన ఎత్తులో సెట్.. మెత్తగా,సౌకర్యంగా ఉండేలా..
Pancake Pillow:కొంతమందికి తలకింద ఒక దిండు పెట్టుకుంటే సరిపోతుంది. మరి కొంతమందికి రెండు లేదా మూడు దిండ్లు ఉంటే గాని నిద్ర పట్టదు. అలా వేసుకునే దిండ్లు కూడా మెత్తగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండాలని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు పాన్ కేక్ పిల్లో దొరుకుతుంది. పేరుకి ఇది ఒకే దిండు ఆయన దీని లోపల ఆరు దిండ్లు ఉంటాయి.
ఒకవేళ ఎత్తు తగ్గించుకోవాలి అని అనుకుంటే ఆ గలేబులోని ఒకటి లేదా రెండు దిండ్లను తీసేసి మళ్లీ జిప్ పెట్టేస్తే సరిపోతుంది. దీనిలో 6 దిండ్లుఉన్నా.. లేదంటే రెండు దిండ్లు ఉన్నా.. అంతే మెత్తగా, సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు. కాబట్టి మనకు నచ్చిన విధంగా నచ్చిన ఎత్తులో దిండు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. ఈ దిండు చాలా బాగుంది కదా.. వెంటనే ఆర్డర్ పెట్టేయండి.