Business

IRCTC Araku Tour : ఈ కొత్త సంవత్సరంలో ‘అరకు’ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ ఒక్కరోజు టూర్ ప్యాకేజీ చూడండి

IRCTC Araku Tour : ఈ కొత్త సంవత్సరంలో ‘అరకు’ ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ఒక్క రోజులోనే ముగుస్తుంది. దీనికి సంబంధించిన డేట్స్ తో పాటు ధరలను కూడా ప్రకటించింది.

‘VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ విశాఖ నుంచి జనవరి 25,2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.

ఈ టూర్ ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అయ్యి..అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్ళుతున్నప్పుడు సరికొత్త అనుభూతి కలుగుతుంది.

అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత… బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను చూసిన తర్వాత లంచ్ ఉంటుంది. ఆ తర్వాత వైజాగ్ తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.

వైజాగ్ – అరకు టూర్ ధరలు:
Visakhapatnam Araku Tour Cost: ఈ ఒక్క రోజు ప్యాకేజీకి చూస్తే… కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 17715.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10100.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా నిర్ణయించారు. చిన్న పిల్లలకు ఎక్స్ ట్రా బెడ్ తో కలిపి రూ. 5915గా ఉంది. వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.