Vitamin E For Hair:బియ్యంతో ఇలా చేస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Rice Water and vitamin E hair Fall Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా రాలిన ప్రదేశంలో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీని కోసం ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది. .
ఒక బౌల్లో మూడు స్పూన్ల బియ్యం వేసి నీటిని పోసి శుభ్రంగా కడగాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కొంచెం వేడెక్కాక కడిగి పెట్టుకున్న బియ్యం, గుప్పెడు ఎర్ర మందార పువ్వు రేకలు లేదా ఒక స్పూన్ మందార పువ్వుల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని ఒక బౌల్ లోకి వడగట్టి చల్లారనివ్వాలి. ఈ నీరు చల్లారాక ఒక స్పూన్ ఆముదము, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
ఈ రెమెడీని ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు. ఈ రెమిడీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సులభంగానే అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది. తాజా మందార పువ్వులు లేకపోతే మందార పువ్వుల పొడిని వాడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


