Tv serials telugu:తెలుగు బుల్లితెరను ఏలేస్తున్న కన్నడ భామలు
Tv Serilas Telugu: ఇప్పటిదాకా తెలుగు సినీ ఇండస్ట్రీని కన్నడ హీరోయిన్స్ ఎలేస్తుంటే,ఇక బుల్లితెరపై కూడా కన్నడ హీరోయిన్స్ హవా పెరిగిపోయింది. తమ అందం తో పాటు నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు తల్లి,చెల్లి,వదిన ఇలా పలు క్యారెక్టర్స్ కి కూడా కన్నడ వాళ్లనే ఎంపిక చేస్తున్నారు.
అంతేకాదు హీరోస్ ని కూడా కన్నడ నుంచి దిగుమతి చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో హీరోయిన్ దీప,అగ్నిసాక్షి లో హీరోయిన్ గౌరీ,కథలో రాజకుమారి సీరియల్ హీరోయిన్ ఆషిక, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరోయిన్ ఆయేషా,కోయిలమ్మలో తేజస్విని తమ నటనతో సత్తా చాటుతూ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.
అలాగే కృష్ణవేణి సీరియల్ లో మంజుల, అమ్మ నా కోడలా సీరియల్ లో హీరోయిన్ నిత్యా రామ్,ముత్యాల ముగ్గు సీరియల్ హీరోయిన్ యామిని, నాపేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య సామి,శశిరేఖా పరిణయం హీరోయిన్ మిధున లోకేష్, వరూధిని పరిణయం హీరోయిన్ చందన..
అష్టా చెమ్మా సీరియల్ చైత్ర, రాధాగోపాళం సీరియల్ లో కవిత,రామ సీత సీరియల్ లో ప్రీతి,లక్ష్మీకళ్యాణం సీరియల్ హీరోయిన్ హర్షిత, పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ పల్లవి గౌడ, ఇలా చాలామంది తెలుగు బుల్లితెర ప్రేక్షలకు దగ్గరయ్యారు.
మరి తెలుగు రాకపోయినా కన్నడ హీరోయిన్స్ ఇంతగా దూసుకుపోతుంటే,ఇక తెలుగు వచ్చిన మన తెలుగు భామలకు ఛాన్స్ లు ఇస్తే, ఇంకెతలా తమ సత్తా చాటుతారో చెప్పాలా? కానీ తెలుగు బుల్లితెర పాపులర్ హీరోయిన్స్ తక్కువ మోతాదులోనే ఉన్నారు. బుల్లితెర హీరోయిన్ పల్లవి రామ శెట్టి, మనసు మమత సీరియల్ హీరోయిన్ శిరీష,అనూషా రెడ్డి ఇలా చాలా తక్కువమంది మనవాళ్ళు ఉన్నారు.
వీళ్ళందరికీ అందం ,అభినయం ఉన్నా సరే,డైరెక్టర్స్ కన్నడ భామలవైపు మొగ్గు చూపుతున్నారు. పల్లవి చేసిన సీరియల్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక శిరీష సైతం ఎన్నో టాప్ సీరియల్స్ ని తన ఖాతాలో జమచేసుకుంది. కన్నడ భామలు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా ఛాన్స్ లు కొట్టేస్తుంటే మనవాళ్లకు ఇక్కడ ఛాన్స్ లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా డైరెక్టర్స్ ఈ వాస్తవాన్ని గుర్తించి మనవాళ్లకు ఛాన్స్ లు ఇస్తే మంచిదని అందరూ అంటున్నారు.
Click Here To Follow Chaipakodi On Google News

