Devotional

Pooja Room : పూజ గదిలో ఉండే ఫోటోలు, విగ్రహాల‌ను..ఏ రోజు ఏ సమయంలో శుభ్రం చేయాలో తెలుసా…?

Pooja Room details : మనం ప్రతి రోజు దేవునికి పూజ చేస్తాం. దేవుని గదిలో ఎన్నో ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి. అయితే వాటిని ఏ రోజు ఏ సమయంలో చేస్తే ఎలాంటి పలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. దేవుని గదిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి.మనిషి జీవితంలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులు అనేవి సాధారణమే.

అయినా మనిషి కష్టాలను అనుభవించటానికి ఏ మాత్రం సిద్ధంగా ఉండడు. మన పురాణాలు,పెద్దలు,పండితులు చెప్పిన ప్రకారం మనం చేసిన పనుల కారణంగానే కష్ట సుఖాలు ఆధారపడతాయి. మనం ప్రతి రోజు దేవుణ్ణి ధ్యానించటం,మనస్సు మంచిగా ఉండటం, పది మందికి సహాయం చేసే గుణం ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ప్రతి రోజు భగవంతునికి ఆరాధన చేయాలి.

మరి వారంలో ఏడు రోజులు భగవంతుణ్ణి ఆరాదించినప్పుడు, ఆ ఆరాధించే పూజ గది చాలా ప్రశాంతంగా, శుభ్రంగా, నిర్మలంగా ఉండాలి. మరి పూజగదిని ఏ రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసా? పూజ గదిని శుభ్రం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పూజ గది మరియు పూజగదిలో దేవత విగ్రహాలను శుక్రవారం ఎట్టి పరిస్థితిలోను శుభ్రం చేయకూడదు.

పూజగదిలో దేవత విగ్రహాలను గురువారం శుభ్రం చేసుకుంటే పసుపు,కుంకుమ అలంకరణ చేయాలి. శుక్రవారం నాడు ఆ విగ్రహాల మీద గంగా జలం చల్లి పూజ చేసుకోవాలి. ఒకవేళ శుక్రవారం దేవత విగ్రహాలను శుభ్రం చేయవలసి వస్తే శుక్రవారం సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి. పూజ సామాగ్రి మరియు దేవత విగ్రహాలను సాయంత్రం సమయంలో ఎప్పుడు శుభ్రం చేయకూడదు.

పూజగదిని గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం 6 దాటాక పూజగదిలోని వస్తువులను శుభ్రం చేయకూడదు. మీరు పూజగదిని శుభ్రం చేసుకోవాలంటే వారంలో గురువారం శుభ్రం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.