Devotional

Numerology:మీ పేరు M అక్షరంతో ప్రారంభం అవుతుందా…. మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు

M Letter Numerology in Telugu :పేరులో ఏముందిలే అనుకుంటాం .. కానీ పేరులోనే అసలైంది ఉంటుంది. ఇక ‘M” అనే అక్షరంతో పేరు కనుక మొదలైతే వారికి ఉండే లక్షణాలు, బలం, బలహీనతలు ఎలా వుంటాయో సంఖ్యా శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే “M” అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు నిరాడంబరంగా జీవిస్తారు.
M Letter
ఎంత పెద్దస్థాయిలో ఉన్నాసరే,సాధ్యమైనంత వరకూ సామాన్యంగా ఉంటారే తప్ప, గొప్పలకు పోరు. ఉన్నది తక్కువ, డాంబికం ఎక్కువగా ఉండే వ్యక్తులను చూస్తున్న రోజులివి. కానీ వీళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడతారు. దీన్ని బట్టి వీళ్ళని కోపం ఎక్కువ,తల బిరుసు ఎక్కువ,ఎలా అనేస్తున్నాడో అని అనుకుంటాం
M letter
కానీ, వీళ్ళని బాగా గమనిస్తే, వీళ్ళు చెప్పే మాటల్లో ఓ గురువు, ఓ మార్గదర్శి కనిపిస్తాడు. ఎదుటి వారి లోపాలు, మంచిని విశ్లేషించగల నేర్పరులు. తేనే వంటి మాటలతో కొందరు మోసపుచ్చుతున్నా నమ్మేస్తాం కానీ, ఇలా నిక్కచ్చిగా మాట్లాడే వారిని ఏదేదో అనుకుంటారు. అయితే ఓసారి వాస్తవ కోణంలో చూస్తే, మంచి జరుగుతుంది.
M letter
వీరి స్వభావం శత్రువుగా మారుతుంది. అయినా ఎవరికీ భయపడరు. చెప్పాల్సింది చెప్పేస్తారు. అయితే ఇలా చెప్పడం వలన కష్టాల పాలవుతారు. అందుచేత కొంచెం జాగ్రత్త వహించడం మంచింది. మనం చెప్పేది నిజం అయినప్పటికీ ఎదుటి వ్యక్తులకు ఇషం లేనపుడు, వీరు సంయమనంతో ఉండడం మంచింది. అనవసరంగా శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవడం మంచిది కానేకాదు.
M letter
సాధ్యమైనంత వరకూ సైలెంట్ గా ఉండిపోవడం మంచిది. “M” అనే అక్షరం తో ప్రారంభం అయినవాళ్లు నాకు ఎదుటి వ్యక్తులు చెప్పేవాళ్ళా, నాకు అన్నీ తెల్సు అనుకోవడం వలన ఇబ్బందులు,కష్టాల పాలవుతారు. ఎన్ని తెలివితేటలున్నా,ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాదు. ఇతరులు నన్ను అర్ధం చేసుకోవాలి అని కోరుకుంటారే తప్ప, ఎదుటి వాళ్ళను అర్ధం చేసుకోవాలని ఆలోచించరు.
M lEtter
వీరికి సాధారణంగా స్నేహితులు ఎక్కువ ఉంటారు అలాగే శతృవులు ఎక్కువగానే వుంటారు. ఎక్కువగా ఎవరితో స్నేహం చేయకుండా ఉండడం వీరికి అలవాటు. ఓ గీత గీసుకుని ఆ గీతలోపలే వీరు ఉండిపోతారు. అయితే ఏ వ్యక్తినైనా ఇష్టపడితే జీవితాంతం వారితో ఉంటారు. ఆవేశం, కోపం గా మాట్లాడతారో అప్పుడు ఎదుటి వాళ్ళు అర్ధం చేసుకోకపోతే ఇబ్బందుల పాలు అవుతారు. అందుకే ఈ విషయాలు వీరు గుర్తుంచుకుంటే జీవితంలో పైకి వస్తారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.