Beauty Tips

White Hair: తెల్లజుట్టు పర్మినెంట్ గా నల్లగా మారుతుంది .. కొబ్బరి నూనెకు ఈ 2 కలపండి చాలు

White Hair Problem: తెల్లగా ఉన్న మీ జుట్టు రంగును నల్లగా మార్చడానికి మంచి ఎంపికలు లేవు. ఎందుకంటే ఇది జుట్టును అసహజంగా, పొడిగా మరియు నిర్జీవంగా చేస్తుంది. కాబట్టి మీ జుట్టు మళ్లీ నల్లగా మారాలంటే, ఈ 2 పదార్థాలను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.

ఈ రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు సమస్య, జుట్టు తెల్లబడటం అనేవి ప్రతి ఒక్కరిలోనూ తరచుగా కనబడుతున్నాయి. వీటి నివారణకు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదు, అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితం కనబడుతుంది.

రెండు స్పూన్ల టీ పొడిని మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో పొడిగా చేసుకున్న టీ పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి సరిపడా కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అయ్యాక రెగ్యులర్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు రోజులు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య అలాగే తెల్లజుట్టు సమస్య అన్ని తొలగిపోతాయి.

కాఫీ పొడిలో ఉండే కెఫిన్ తలలో రక్తప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టుకు పోషకాలను అందించి జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే తల మీద చర్మం తేమ ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.