DevotionalToday Rasi Phalalu In telugu

Today Astrology:April 10 రాశి ఫలాలు-ఈ రాశి వారికి కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ ..

Today Astrology:April 10 రాశి ఫలాలు-ఈ రాశి వారికి కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ .. ఒక మనిషి పరిస్థతి బాగా లేకపోతే జాతకాల వైపు ఆలోచనలు వేళ్ళతాయి. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ వారి రాశికి అనుగుణంగా పలితాలను చూసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. ఇక ఏ రాశి వారికీ ఎలా ఉందో చూద్దాం.

మేషం: బంధుమిత్రులతో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు అనుకూలిస్తాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: ఆదాయానికి తగినట్లుగా వ్యయం చేస్తారు. స్త్రీల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం వుంది. రుణ, విదేశీ యాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి.

మిథునం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు. ఆర్ధికంగా బాగుంటుంది.

కర్కాటకం: కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రియతముల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణం ఆందోళన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. క్రయ విక్రయాలు లాభాల బాటలో సాగుతాయి. ఆర్ధికంగా చాలా బాగుంటుంది. డబ్భుకు లోటు ఉండదు.

సింహం: భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. అతిథి మర్యాదలు ఘనంగా చేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సిమెంట్, ఇటుక, కలప, ఐరన్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.

కన్య: ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. సమయానికి కావలసిన వస్తువులు, పత్రాలు కనిపించకపోయే ఆస్కారం వుంది.ఈ రాశి వారు జాగ్రత్తగా లేకపోతే కలహాలకు దారి తీసే అవకాశం ఉంది.

తుల: మీ నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. నిరుద్యోగ, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. మీ సంతానం విద్యా విషయాలు ఆందోళన కలిగిస్తాయి. సోదరీ సోదరులతో విభేదాలు తప్పవు.

వృశ్చికం వృశ్చికం: రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. వాహనం, విలాస వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు: వాహన చోదకులకు మెళకువ అవసరం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల్లో ఒత్తిడి, భయాందోళనలు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఖర్చులు పెరిగిన భారమనిపించవు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోకండి. కలహాలకు దూరంగా ఉండాలి.

మకరం: బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు స్వయం కృషితో బాగా రాణిస్తారు. ఆకస్మిక ప్రయాణం ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కోళ్ల, మత్స్య, పాడి రంగాల వారికి పురోభివృద్ధి. కలహాలకు చాలా దూరంగా ఉంటేనే మంచిది.

కుంభం: సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. షాపుల అలంకరణ, కొత్త కొత్త స్కీములతో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇతరులపై ఆధారపడక స్వయం కృషినే నమ్ముకోవడం మంచిది.

మీనం: ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన వుండదు. స్త్రీలకు అన్నివిధాలా శుభదాయకంగా ఉంటుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌకికం అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. చిన్ననాటి వ్యక్తులను, పాత మిత్రులను కలుసుకుంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.