Beauty Tips

White Teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Yellow Teeth home remedies : పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. అందువల్ల మనలో చాలా మంది గార పట్టిన ,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. తెల్లని పళ్ళ కోసం ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

అల్లం ముక్కను తీసుకొని పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ గా చేసి రసం తయారుచేసుకోవాలి. రెండు స్పూన్ల అల్లం రసంలో అరస్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంను బ్రష్ సాయంతో పళ్లను తోమాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పళ్ల మీద గార,పసుపు రంగు తొలగిపోతాయి.

అల్లంలో ఉన్న లక్షణాలు పళ్ల చిగుళ్ళకు బలాన్ని ఇవ్వటమే కాకుండా ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. ఉప్పు పళ్ల మీద గారను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇక నిమ్మరసంలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మెరిసేలా చేస్తుంది.

గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.