Yellow Teeth:5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార, పసుపు మొత్తం తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి
Teeth whitening tips : పళ్ళు తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పసుపుపచ్చగా, గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

దంతాలపై పసుపు మరకలు, గార ఉండటం వలన ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అలాగే మనస్ఫూర్తిగా నవ్వటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువలన పసుపుగా మారిన పళ్ళను తెల్లగా మార్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పసుపు, 1/4 స్పూను ఉప్పు, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ మనం రెగ్యులర్ గా ఉపయోగించే టూత్ పేస్ట్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి, ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో దంతాలపై అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోమాలి. .

ఆ తర్వాత గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే దంతాలపై ఏర్పడ్డ పసుపు రంగు, గార వంటివి అన్నీ క్రమంగా తొలగిపోతాయి. కాస్త శ్రద్ధగా సమయాన్ని కేటాయించి ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్లని దంతాలను సొంతం చేసుకోవచ్చు. ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పసుపు కొమ్ములను తెచ్చుకొని ఆడించుకున్న పసుపు అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన ఆన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అయ్యి తెల్లని దంతాలను సొంతం చేసుకొండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


